టీజర్‌ టాక్..’తిప్పరా మీసం’

531
Thipparaa Meesam
- Advertisement -

బ్రోచేవారెవరురా మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో శ్రీవిష్ణు తాజాగా ‘తిప్పరా మీసం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్న శ్రీవిష్ణ తాజాగా టీజర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 5 రాత్రి 8 గంటల 10 నిమిషాలకు టీజర్‌ని విడుదల చేశారు చిత్రయూనిట్. దర్శకుడు కృష్ణ విజయ్ ఎల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నిక్కి తంబోలీ, రోహిణి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మందు, సిగరెట్‌, అమ్మాయిల్లా..శత్రువు కూడా వ్యసనమే..ఆ వ్యసనానికి నేను కూడా బానిసనే అనే డైలాగ్స్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. శ్రీ విష్ణు గుబురు గడ్డంతో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.

- Advertisement -