శ్రీ విష్ణు… ‘అర్జున ఫల్గుణ’

62
sree vishnu
- Advertisement -

కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ఈ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 09గా హీరో శ్రీ విష్ణు, జోహార్ ఫేమ్ తేజ మర్ని కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతోంది. అర్జున ఫల్గుణ అనే టైటిల్‌తో రాబోతోన్న ఈ సినిమా టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు.

మనం జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు వెళ్లాల్సిందే. కొన్ని ఘటనలు మాత్రం మన జీవితాల్ని తలకిందులు చేస్తాయి. ఇదే విషయాన్ని టీజర్‌లో చూపించారు. ‘నాది కాని కురుక్షేత్రంలో.. నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా నేను బలైపోవడానికి అభిమన్యుడిని కాదు.. అర్జునుడిని’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌తో సినిమా నేపథ్యం ఏంటో అర్థమవుతోంది. 65 సెకన్ల టీజర్‌లో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లను చూపించారు.

డైలాగ్స్, విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. జగదీష్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ అందరినీ కట్టిపడేసేలా ఉంది. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది.ఎన్ ఎమ్ పాషా సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు.

అర్జున ఫల్గుణ త్వరలోనే థియేటర్‌లోకి రానుంది.నటీనటులు : శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు

సాంకేతిక బృందం

నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సహ నిర్మాత : ఎన్ ఎమ్ పాషా
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : తేజ మర్ని
డైలాగ్స్ : సుధీర్ వర్మ. పి
సినిమాటోగ్రపీ : జగదీష్ చీకటి
ఆర్ట్ డైరెక్టర్ : గంధి నడికుడికర్
యాక్షన్ : రామ్ సుంకర
మ్యూజిక్ డైరెక్టర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్
లిరిక్స్ : చైతన్య ప్రసాద్
పబ్లిసిటీ డిజైన్ : అనిల్&భాను
పీఆర్వో : వంశీ-శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్ : ప్రసన్న వర్మ దంతులూరి

- Advertisement -