రాబిన్‌ హుడ్‌తో శ్రీలీల రొమాన్స్!

7
- Advertisement -

వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్హుడ్ లో హీరో నితిన్ మునుపెన్నడూ లేని తరహా పాత్రలో అద్భుతంగా కనిపించబోతున్నాడు. వెంకీ కుడుముల తన గెటప్ నుండి క్యారెక్టరైజేషన్ వరకు నితిన్ని పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. అతన్ని దొంగగా పరిచయం చేసిన టీజర్ హాస్యభరితంగా ఉండగా, బర్త్ డే గ్లిమ్ప్స్ పూర్తి యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత స్థాయి నిర్మాణ, సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఈ సినిమాలో మొద‌ట‌గా ర‌ష్మిక న‌టిస్తుంద‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె తప్పుకోగా తర్వాత పలువురి పేర్లు వినిపించాయి. కానీ తాజాగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుందని మేకర్స్ వెల్లడించారు.

ఇవాళ శ్రీలీల పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమెకు విషెస్ తెలియ‌జేస్తూ అస‌లు విష‌యం చెప్పేసింది. లేడీ బాస్ వ‌చ్చేసింది.. హ్యాపీ బ‌ర్త్‌డే శ్రీలీల అలియాస్ నీరా వాసుదేవ్ అంటూ స్ట్రైలిష్ లుక్‌లో ఉన్న శ్రీలీల పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మారింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Also Read:ఈవీఎంల గోల్‌మాల్‌..కేతిరెడ్డి వీడియో

- Advertisement -