శ్రీలీల – కాజల్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

79
- Advertisement -

టాలీవుడ్ సెన్సేషన్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్లకు ధీటుగా దూసుకెళ్తోంది. తాజాగా ‘భగవంత్ కేసరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య కూతురిగా నటించి శ్రీలీల మంచి పేరు కొట్టేసింది. ఈ సినిమాకు శ్రీలీల రూ.1.8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక కాజల్ రూ.1.4 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఒకవిధంగా వీరిద్దరికీ ఎక్కువ ఇచ్చినట్లే. ఇక బాలయ్య ఈ సినిమా కోసం 20 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం భ‌గ‌వంత్ కేస‌రి సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ దిశ‌గా దూసుకెళ్తుంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డంతో చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది. మ‌రో ముడు రోజుల్లో భ‌గ‌వంత్ కేస‌రి స‌క్సెస్ మీట్‌ ఏర్పాటు చేస్తామ‌ని, దానికి బాలయ్య కూడా రానున్నారని అనిల్ తెలిపాడు. మొత్తానికి ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ బాల‌య్య ఫ్యాన్స్‌తో పాటూ, ప్రేక్ష‌కుల‌ను కూడా విశేషంగా ఆక‌ట్టుకుంది.

బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతున్న భ‌గ‌వంత్ కేస‌రి నైజాంలో రెండో రోజు కూడా రూ.3.12 కోట్ల షేర్ ను వ‌సూల్ చేసింది. అన్నట్టు, మూవీ టీమ్ త్వరలో సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఈ సినిమాలోని మెసేజ్ స్కూల్ ఏజ్ ఆడ పిల్లలకు చేరాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ఫ్రీ షోలు వేయనున్నట్టు ప్రకటించింది.

Also Read:బాలీవుడ్ లో దూసుకుపోతుంది

- Advertisement -