శ్రీలీల ఎంత స్పీడ్ గా ఎదిగిందో.. అంతే స్పీడ్ గా ప్లాప్ లు ఎదుర్కొంది. సాధారణంగా ఒక్క ఫ్లాప్ పడితినే అవకాశాలు రావు. ఇది సినిమా ఇండస్ట్రీ పద్దతి. సక్సెస్ వెంట పరుగులు తీస్తుంది చిత్రసీమ. ఐతే, ఇండస్ట్రీలో శ్రీలీల లాంటి కొందరికి మాత్రం అదృష్టం వేరుగా ఉంటుంది. హిట్ లు లేకపోయినా వరుసగా అవకాశాలు వస్తుంటాయి. ఈ లిస్ట్ లో శ్రీలీల ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం ఇలా వరుసగా శ్రీలీల ప్లాప్ లిస్ట్ చాలా పెద్దది.
నిజానికి, శ్రీలీల అనే హీరోయిన్ పేరు చెప్తే.. ప్రస్తుతం ఆమె ప్లాప్ కి పర్యాయపదం. కానీ, మన తెలుగు నిర్మాతలు వరుసగా ఆఫర్లు ఇస్తున్నారు. ఈ తెలుగు ముద్దుగుమ్మ సరసన “పెళ్లి సందడి” సినిమాతో పరిచయం అయింది. మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్. ఆ తర్వాత రవితేజ సరసన “ధమకా”లో నటించింది. అది కూడా అపజయమే. అయినా, ఇప్పుడు ముచ్చటగా శ్రీలీలకి మరో స్టార్ హీరో చిత్రం దక్కింది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న సినిమాలో బన్నీ సరసన నటించబోతోంది ఈ భామ.
అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ పూర్తి వినోదాత్మక చిత్రం ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో బన్నీ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. ఒక హీరోయిన్ గా సంయుక్త మీనన్, మరో భామగా శ్రీలీల నటించనుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమాలో అల్లు అర్జున్ కు ఓ వైల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని, ఆ ఫ్లాష్ బ్యాక్‌లో అల్లు అర్జున్ రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తాడని, యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో వచ్చే ఈ ఫ్లాష్ బ్యాక్ సినిమాలోనే హైలైట్ గా ఉంటుందట.
Also Read:TTD:అర్ధ బ్రహ్మోత్సవానికి విస్తృత ఏర్పాట్లు