సెమీ న్యూడ్ గా శ్రీలీల.. కాజల్ రొమాన్స్ కూడా

160
- Advertisement -

టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య ప్రస్తుతం భగవంత్‌ కేసరి సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్‌ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ ఊర మాస్‌ బీట్‌ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్‌ను కూడా రూపొందించారని సమాచారం. ఈ పాటలో బాలయ్యతో కలిసి కాజల్‌, శ్రీలీల కూడా చిందులేయనున్నట్లు తెలుస్తోంది. ఇది శ్రీలీల‌ పెళ్లికి సంబంధించిన సాంగ్‌ అని టాక్. సినిమాలో శ్రీలీల‌ బాలయ్య కూతురిగా నటిస్తోంది.

అమ్మాయిలను ట్రాప్ చేసి.. విదేశాలకు ఎగుమతి చేస్తున్న మాఫియా పై బాలయ్య ఎలా పగ తీర్చుకున్నాడు అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్ అట. తన పాత్రకు కూతురిగా నటిస్తున్న శ్రీలీల‌ను కూడా విలన్లు ట్రాప్ చేస్తారని.. ఈ క్రమంలో కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా శ్రీలీల‌ ఈ సీన్స్ లో సెమీ న్యూడ్ గా నటిస్తోందట. కాకపోతే.. సినిమాలో సెమీ న్యూడ్ గా చూపించరు. మొత్తమ్మీద శ్రీలీల‌ నుంచి మరో అందాల ట్రీట్ రాబోతుంది. ఎలాగూ కాజల్ అగర్వాల్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. బాలయ్యతో కాజల్ కి ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉందట.

Also Read:టెస్టు క్రికెట్‌కు బ్రాడ్ గుడ్ బై..

బిజినెస్ మేన్ లో మహేష్ బాబు – కాజల్ అగర్వాల్ మధ్య బెడ్ సాంగ్ అండ్ లిప్ కిస్ ఎలా అయితే వైరల్ అయిందో.. దాదాపు ఆ రేంజ్ లోనే బాలయ్య – కాజల్ మధ్య రొమాంటిక్ మూమెంట్స్ ఉంటాయట. సహజంగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా వస్తోంది అంటే.. ప్రేక్షకులు కామెడీ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ, ఈ సారి బాల‌య్య హీరోగా న‌టిస్తున్న భ‌గ‌వంత్ కేస‌రిలో మాత్రం రొమాన్స్ కూడా ఎక్స్ పెక్ట్ చెయ్యొచ్చు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబ‌ర్ 19న రిలీజ్ కానుంది.

Also Read:ముగ్గురు హీరోయిన్లను వేధించారట

- Advertisement -