అటు మెగా హీరోతో, ఇటు నందమూరి హీరోతో!

30
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం మెగాప్రిన్స్ వైష్ణవ్ తేజ్తో కలిసి నటించిన ‘ఆదికేశవ’ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలో శ్రీలీల సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో చిట్చాట్ నిర్వహించింది. ఆమె అభిమాని ఒకరు ‘మీరు కమిడెట్ హా’ అన్న ప్రశ్నకు’.. అవును నేను నా ప్రొఫెషన్తో రిలేషన్షిప్లో ఉన్నా’ అని బదులిచ్చింది. ఇప్పటికే, శ్రీలీల పై అనేక ప్రేమ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్య కొడుకు మోక్షజ్ఞతో శ్రీలీల ప్రేమ కహానీలు నడుపుతుందని వార్తలు వచ్చాయి.

ఒకపక్క మోక్షజ్ఞతో శ్రీలీల ప్రేమ కహానీల వార్తలు ఇంకా మర్చిపోక ముందే, ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తోంది. మెగా ప్రిన్స్ వైష్ణవ్ తేజ్తో కూడా శ్రీలీల ప్రేమలో పడింది అని, ఆమె త్వరలోనే వైష్ణవ్ తేజ్ ను పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అవుతుందని టాక్ నడుస్తోంది. మొత్తానికి రిలేషన్షిప్లో ఈ యంగ్ బ్యూటీ ఉందో లేదో తెలియదు గానీ, అటు మెగా ఫ్యామిలీకి చెందిన హీరోతో, ఇటు నందమూరి హీరోతో చనువుగా ఉంటుందట. ఏది ఏమైనా శ్రీలీల చాలా టాలెంటెడ్ పిల్ల. అమ్మడు ఏం చేసినా ప్రత్యేకమే. ఆల్ రెడీ టాలీవుడ్‌ లో వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది.

పైగా ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ లో శ్రీలీల నే టాప్ హీరోయిన్. అందుకు తగ్గట్టుగానే ఆమె నటించిన చిత్రాలకు ప్రేక్షుకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండడంతో శ్రీలీల రేంజ్ మారిపోయింది. అంతెందుకు శ్రీలీలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటిస్తోంది అని తెలియగానే.. ఆమెతో చాట్ చేయాలని లక్షల మంది ఫాలోవర్స్ ఆమెకు మెసేజ్ లు చేయడానికి ప్రయత్నం చేశారు. అది శ్రీలీల రేంజ్.

Also Read:Allu Arjun:’మంగళవారం’ టీజర్ చూసి షాకయ్యా

- Advertisement -