హీరోయిన్ ‘శ్రీలీల’ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ‘పెళ్ళిసందD చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైనా తర్వాత ‘ధమాకా’ ‘భగవంత్ కేసరి’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సొంతం చేసుకుంది.
గుంటూరు కారం సినిమా తర్వాత శ్రీలీల కెరీర్ అమాంతం మారిపోయింది. ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ కు అదిరే రెస్పాన్స్ వచ్చింది. ఇంటర్నేషనల్ స్టేడియంలలో సైతం ఈ సినిమాలోని పాటలు ప్లే చేస్తూ వచ్చారు. అటు తర్వాత ‘పుష్ప 2’ అనే పాన్ ఇండియా సినిమాలో ‘కిస్సిక్’ అనే స్పెషల్ సాంగ్ చేసి ఇండియా మొత్తం పాపులర్ అయిపోయింది. దీంతో ఆమెకు ‘ఆషికి 3’ అనే బాలీవుడ్ సినిమాలో స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటించే ఛాన్స్ లభించింది.
ఈ సినిమా చిత్రీకరణ సమయంలో శ్రీలీల,కార్తీక్ ఆర్యన్..ల మధ్య ప్రేమ చిగురించిందని, ప్రస్తుతం వారు డేటింగ్లో ఉన్నారనే వార్తలు కూడా షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని వీరు అధికారికంగా ప్రకటించింది లేదు.ఇప్పటికే చాలా సినిమా వేడుకల్లో, ఈవెంట్లలో కూడా వీరు కలిసి కనిపించారు. తాజాగా కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ అటెండ్ అయిన ఓ ఈవెంట్లో కూడా శ్రీలీల తన కుటుంబంతో హాజరవ్వడంతో ఈ వార్తలకి మరింత బలం చేకూరినట్టు అయ్యింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఈ జంట హాట్ కపుల్ గా పేరొందింది.
ఇక ‘ఆషికి 3’ తో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల ఆ సినిమాతో..నార్త్ లో పాగా వేయడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే తెలుగులో ప్రస్తుతం రవితేజతో ‘మాస్ జాతర’, పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, అఖిల్ తో ‘లెనిన్’ వంటి క్రేజీ సినిమాల్లో నటిస్తూ యమ బిజీగా గడుపుతుంది.
Also Read:కులగణన దేశంలోనే గేమ్ ఛేంజర్

