తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఈ ఐదు భాషల్లోనూ గుంటూరు కారం కోసం శ్రీలీల తన డబ్బింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె మెయిన్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. మరి, తన పాత్రకు ఎవరో డబ్బింగ్ చెప్పడం కన్నా.. తెలుగు – కన్నడ ఆవల కూడా తనే డబ్బింగ్ చెప్పడానికి శ్రీలీల తెగ శ్రమించిందట. ఒక్క భాషను కూడా వదలకుండా అన్ని భాషల్లోనూ సొంత డబ్బింగ్ చెప్పిందట. ఇది అంత తేలికైనది ఏమీ కాదు. మార్కెట్ కోసమే అయితే తెలుగు, హిందీ వరకూ ఆగిపోయేది. అయితే, తన అంకితభావం కొద్దీ శ్రీలీల అన్ని భాషల్లోనూ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుందని చెప్పాలి.
టాలెంటెడ్ హీరోయిన్ లకే ఈ తత్వం ఉంటుంది. సాయి పల్లవి తను నటించే ఇతర భాషల సినిమాల్లో తనకు తానే డబ్బింగ్ చెప్పుకునేందుకు ప్రాధాన్యతను ఇస్తోంది. కాజల్ కూడా ఇలాంటి ప్రయత్నమే చేసింది. బిజినస్ మెన్ సినిమా సమయంలో ఆమె ఓన్ గా తెలుగు డబ్బింగ్ కు ప్రయత్నించింది. అయితే ఎందుకో చివర్లో కాజల్ కు డబ్బింగ్ ఆర్టిస్ట్ చేత డబ్బింగ్ చెప్పించారు. తన ప్రయత్నం అయితే ఆ స్టార్ హీరోయిన్ చేసింది. వారి పరంపరనే కొనసాగిస్తూ.. ఇప్పుడు శ్రీలీల కూడా తన పాత్రకు తనే డబ్బింగ్ ఫార్ములాను ఫాలో అవుతుంది.
మరోవైపు యంగ్ బ్యూటీ కృతి శెట్టి కూడా తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తోంది. తెలుగులో కూడా కృతి శెట్టి ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటుంది. పాన్ ఇండియా స్టార్లుగా చలామణి కావాలనే ప్రయత్నం అన్ని భాషల హీరోయిన్ లూ చేస్తున్నారు, కానీ.. ఇలా తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకోవడం ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం కొందరు భామల వైపు నుంచినే గట్టిగా ఉంది!
Also Read:KTR:ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కమిటీ