హిందీ తెర పై శ్రీలీల అడుగులు

43
- Advertisement -

హీరోయిన్ ‘శ్రీలీల’ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ‘గుంటూరు కారం’ సినిమాతో ఈ భామ.. సూపర్ స్టార్ సరసన నటించింది. ఇందులో, హీరోయిన్ పాత్రలో ‘శ్రీలీల’ అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత, వెంటనే న్యాచురల్ స్టార్ నాని నటించబోయే సినిమాతో మరోసారి శ్రీలీల అలరించబోతుంది. ఐతే, విజయ్ దేవరకొండ కొత్త సినిమా నుంచి శ్రీలీల తప్పించుకుంది. కానీ, ఇప్పుడు ఉన్నట్టు ఉండి, నాని మూవీ ‘శ్రీలీల’ వద్దకు రావడం విశేషం.

ఈ క్రమంలో తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన శ్రీలీల.. తన నెక్ట్స్ మూవీస్.. ఫిల్మ్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. అంతేకాకుండా తాను ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ కొత్త సినిమాని కూడా చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. శ్రీలీల మాట్లాడుతూ.. ‘హిందీలో చాలా సినిమాల ఆఫర్స్ వస్తున్నాయి. కానీ మంచి ప్రేమకథ మాత్రం రావడం లేదు. అలాంటి సినిమాలు చేయాలని ఉంది. కానీ.. నాకు రొమాంటిక్ లవ్ స్టోరీస్ రావడం లేదు. శ్రీలీల ఫలానా పాత్రలే చేస్తోంది అని పేరు రాకూడదు’ అని శ్రీలీల చెప్పుకొచ్చింది.

శ్రీలీల ఇంకా మాట్లాడుతూ.. ‘ఐతే, హిందీలో నన్ను నేను నిరూపించుకోవడానికి ఇంకా ఎంతగా అలసిపోవాలో. బహుశా నేను హిందీలో ఇంకా అంతగా ఫేమస్ కాలేదేమో. కానీ, నాకు అక్కడ మంచి అవకాశాలు రావాలని కోకరుకుంటున్నాను’ అంటూ శ్రీలీల చెప్పుకొచ్చింది. తాను రొమాంటిక్ సినిమాలు చూస్తూ పెరిగానని.. లవ్ స్టోరీస్ చేయాలని తనకు ఇష్టమని శ్రీలీల తెలిపింది.

Also Read:Harish:అత్యాధునిక టెక్నాలజీతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ

- Advertisement -