వెనక్కి తగ్గిన శ్రావణ భార్గవి!

24
- Advertisement -

ఎట్టకేలకు వివాదానికి పుల్ స్టాప్ పెట్టింది సింగర్ శ్రావణ భార్గవి. అన్నమయ్య కీర్తనలపై ఆమె తీసిన వీడియోపై అన్నమయ్య వంశీయుల నుండి తీవ్ర నిరసన రాగా దీనిపై తిరుపతిలో ఆమెపై కేసు కూడా నమోదైంది. దీంతో వివాదం పెద్దదికావడంతో ఆమె వెనక్కి తగ్గింది.

వివాదానికి కారణమైన ఆ వీడియోని డిలీట్ చేసింది. తనకు అన్నమాచార్యులు అంటే ఎంతో గౌరవం అని చెప్పింది. ఈ వివాదం మరింత ముదరడం ఇష్టం లేదంది. మరో కొత్త వీడియోను విడుదల చేసింది.

అన్నమయ్య కీర్తనలోని ఒకపరి కీర్తనను తనపై చిత్రీకరించుకుంది శ్రావణ భార్గవి. శ్రీవారి పాటను, భక్తి గీతాన్ని శృంగార గీతంగా మార్చి సాంగ్ చేశారని ఆమెపై అన్నివర్గాల నుండి విమర్శలు వచ్చాయి.

- Advertisement -