ప్ర‌ముఖ నిర్మాత శేఖ‌ర్ బాబు క‌న్నుమూత‌..

209
- Advertisement -

ప్రముఖ సినీ నిర్మాత కేసీ శేఖ‌ర్ బాబు (71) శుక్ర‌వారం సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్‌ జర్నలిస్టు కాలనీలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కృష్ణ -జ‌మున కాంబినేష‌న్ లో `మమత`, అనే చిత్రాన్ని, త‌ర్వాత అదే హీరోతో `స‌ర్దార్`, మెగాస్టార్ చిరంజీవితో `ముఠామేస్త్రీ`, `సంసారబంధం`, `గోపాలరావుగారి అమ్మాయి`, `పక్కింటి అమ్మాయి` చిత్రాలను నిర్మించారు.

 Sr producer Sri KC Sekhar babu died

సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి కూడా ఆయ‌న విశేష సేవ‌లందించారు. ఫిలిం సెంట్ర‌ల్ బోర్డ్ చైర్మ‌న్ గా, ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీగా గా ఆయ‌న ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ద‌క్షిణాది ఫిలించాంబ‌ర్ క‌మిటీ మెంబ‌ర్ గా సేవ‌లందిస్తున్నారు. ఇంత‌లోనే ఆయ‌న హాఠాన్మ‌ర‌ణం టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌ని క‌ల‌చి వేసింది. శేఖర్‌బాబు మృతిపట్ల పలువురు సినీ నటులు, ప్రముఖులు సంతాపం తెలిపారు.

- Advertisement -