బెదిరించినా.. ఏడ్చినా.. స్పైడర్ వస్తాడు

231
spyder reales high expectations in tamil
- Advertisement -

మహేష్-మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న స్పైడర్ ట్రైలర్ కొద్ది గంటల క్రితం విడుదలైంది. ఇప్పటి వరకు కేవలం సాంగ్స్, టీజర్ తోనే అభిమానులని సంతృప్తి పరచిన టీం ట్రైలర్ విడుదల చేసి అభిమానులలో సరికొత్త ఆనందాన్ని నింపింది. మహేష్ తనదైన స్టైల్ లో అదరగొడితే, రకుల్ మెడికల్ స్టూడెంట్ పాత్రలో ఒదిగిపోయింది.

“నా పేరు శివ.. ఇదే నా ఆఫీస్‌.. ఫోన్‌లో ఎవరైనా బెదిరించినా.. ఏడ్చినా.. హెల్స్‌ అని అన్నా.. నా సాఫ్ట్‌వేర్‌ ఆన్‌ అయి స్క్రీన్‌ బ్లింక్‌ అవుతుంది.” మొదలయ్యే ట్రైలర్‌లో మహేష్‌ మరోసారి అదరగొట్టాడు. ఇక రకుల్‌ప్రీత్ కళ్లద్దాలతో ఇన్నోసెంట్‌గా కనిపిస్తూనే కొంటెగా మాట్లాడేస్తుంది. ‘లైబ్రెరీలో ఎలా మాట్లాడుకుంటాం’ అని మహేష్ అడిగితే.. ‘కిస్.. కిస్..’ అని మాట్లాడుకుందాం అని రకుల్ బదులిచ్చింది. దానికి మహేష్ కూడా ‘సరే కిస్.. కిస్..’ అని మాట్లాడుకుందాం అంటున్నాడు. అయితే ఈ ట్రైలర్‌లో గత టీజర్‌లో వచ్చిన సీన్లే కనిపిస్తుండడం కొంత మహేష్ ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తుంది. మురుగదాస్‌ కూడా ట్రైలర్‌ కట్‌లో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. సినిమా స్టోరీ రివీల్ కాకుండా ట్రైలర్‌ను విడుదల చేసి.. మరోసారి స్పైడర్‌పై హైప్‌ను పెంచేశాడు. ప్రతి సీన్ మురుగదాస్ స్టైల్ లో అభిమానులని ఆకట్టుకునేలా ఉంది. ఇక విలన్ పాత్రధారి ఎస్ జే సూర్య ఆకట్టుకున్నాడు. హరీష్ జై రాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరిపోయింది.

కాగా , ఈ సినిమా దసరా సందర్భంగా వచ్చేనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం స్పైడర్ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. మరి మీరు ఆ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

- Advertisement -