స్పైడర్ యాక్షన్ సీన్స్‌ లీకయ్యాయి !

184
Spyder Shooting Leaked Scenes...
Spyder Shooting Leaked Scenes...
- Advertisement -

మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ మూవీ షూటింగ్ షరవేగంగా జరుపుకుంటోంది. ఆమధ్య ఈ సినిమా మేకింగ్ లో కొంత డిలే జరిగింది. సినిమా చిత్రీక‌ర‌ణ‌ ఆలస్యం కావడంతో మహేష్ బాబుకు కాస్త చికాకు కలిగిందనీ, అయినా మురుగదాస్ కోసం డేట్స్ సర్దుబాటు చేసి కోపరేట్ చేశాడనీ చెబుతున్నారు. ఒకవంక షూటింగ్ జరుపుకొంటూనే ఇటీవల స్పైడర్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. దాంతో ఈ సినిమా యూనిట్ మరింత ఉత్సాహంగా వర్క్ చేస్తోంది. తాజాగా ‘స్పైడర్’ మూవీ షూటింగ్ వీడియో ఒకటి లీకైంది. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్ల చిత్రీకరణకు సంబంధించిన ఈ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయింది.

లీకైన వీడియో చూస్తుంటే సినిమాలో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లు అభిమానులను ఓ రేంజిలో అలరించనున్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకున్న స్పైడర్‌ కొద్ది రోజుల్లో చిత్ర షూటింగ్ పూర్తి అవుతుంది. ద‌స‌రా కానుక‌గా ఈ మూవీ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. మహేష్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోన్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్ గా చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీస్థాయిలో జరుగుతోందట. దర్శకుడిగా మురుగదాస్ ఇమేజ్ , మహేశ్ బాబు క్రేజ్.. ఈ రెండింటి కారణంగా, స్పైడ‌ర్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

https://youtu.be/aaZg4_kUui8

- Advertisement -