అక్కడ కూడా భారీ రిలీజ్ కు రెడీ..!

202
spyder reales high expectations .. tamil
- Advertisement -

మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘ స్పైడర్’. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా తెలుగు,తమిళ్, ఈ రెండు భాషల్లోను విడుదలకానుంది. తెలుగులో భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమా, తమిళంలోను అదే స్థాయిలో విడుదలవుతోంది.

 spyder reales high expectations in tamil

తొలిరోజున ఈ సినిమా అక్కడ 450 స్క్రీన్లపై రిలీజ్ అవుతోంది.  అజిత్ , విజయ్ సినిమాలపట్ల చూపించే ఆసక్తినే ఈ సినిమా పట్ల అక్కడివారు చూపడం విశేషం. తమిళంలోను మహేశ్ బాబుకి గల క్రేజ్ .. మురుగదాస్ సినిమాల పట్ల గల నమ్మకం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.

 spyder reales high expectations in tamil

 ఈ సినిమా, అక్కడ తన మార్కెట్ ను మరింతగా పెంచుతుందని మహేశ్ భావిస్తున్నాడు. ఇక తెలుగు .. తమిళ భాషల్లో తన క్రేజ్ ను ఈ సినిమా మరింతగా పెంచుతుందనే నమ్మకంతో రకుల్ కూడా వుంది.

ఇంతవరకూ ఆమె చేసిన చిత్రాలలో ఇదే అత్యధిక బడ్జెట్ చిత్రం కావడం విశేషం. చూడాలి మరి రకూల్‌ కు తమిళ ప్రేక్షకులు ఎంత మేరకు అట్రాక్ట్‌ అవుతారో.

- Advertisement -