స్పైడ‌ర్ పెద్ద హిట్ అవుతుంది..

187
- Advertisement -

హైద‌రాబాద్‌లోని శిల్ప‌కళా వేదిక‌లో మహేశ్ బాబు స్పైడ‌ర్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిగింది. అభిమానుల కోలాహ‌లంతో పండ‌గ‌లా జ‌రిగిన ఈ వేడుక‌కు మ‌హేష్ అభిమానులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. మ‌హేశ్‌బాబు త‌న భార్యాపిల్ల‌ల‌తో పాటు వ‌చ్చాడు. ఆయ‌న రాగానే అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. విజిల్స్ వేస్తూ హోరెత్తించారు.

త‌న‌కు ‘స్పైడ‌ర్’ లాంటి సినిమాలో న‌టించే అవ‌కాశం ఇచ్చినందుకు దర్శకుడు మురుగ‌దాస్‌కి కృతజ్ఙ‌త‌లు తెలుపుతున్న‌ట్లు న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించింది. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుతో న‌టించే అవ‌కాశం వ‌చ్చినందుకు రకుల్ ప్రీత్ సింగ్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. మ‌హేశ్‌ ఇంత పెద్ద స్టార్ అయిన‌ప్ప‌టికీ ఎంతో విన‌మ్ర‌త‌తో ఉంటాడ‌ని తెలిపింది. ఈ సినిమా స్క్రిప్ట్ విన‌క‌ముందే ఈ సినిమా చేయాల‌ని తాను ఆరాట‌ప‌డ్డాన‌ని తెలిపింది. స్పైడ‌ర్ ఓ పెద్ద హిట్ అవుతుంద‌ని వ్యాఖ్యానించింది.

‘స్పైడర్‌’ సినిమాని ఏ.ఆర్‌ మురుగదాస్ తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మ‌హేశ్ స‌ర‌స‌న‌ ర‌కుల్ ప్రీత్ సింగ్ నటించింది.

ఈ ఈవెంట్‌కి కృష్ణ, విజ‌య నిర్మ‌ల కూడా వ‌చ్చారు. కాగా, ఈ వేడుకలో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్.. మ‌హేశ్ బాబు కూతురు సితార‌ని త‌న ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఆ ప‌క్క‌న ఉన్న సీట్‌లోనే మ‌హేశ్ బాబు కుమారుడు కూడా కూర్చున్నాడు. మ‌హేశ్ కూతురిని త‌న ఒళ్లో కూర్చోబెట్టుకుని ర‌కుల్ ఇచ్చిన పోజు అభిమానులను అల‌రిస్తోంది.

- Advertisement -