స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు..ఓపెన్ కోటాలోకి!

5
- Advertisement -

హైకోర్టు తీర్పును ధిక్కరిస్తూ, గ్రూప్ 2 నియామకాల్లో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను ఓపెన్ కోటాలోకి మార్చింది రేవంత్ ప్రభుత్వం. గ్రూప్ 2 నియమాకాల్లో ఉండే 2 శాతం స్పోర్ట్స్ కోటాలోని 8 పోస్టుల్లో 7 పోస్టులు ఓపెన్ కోటాకు మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

కేవలం ఇంటర్నేషనల్ క్రీడాకారులకు మాత్రమే ఉద్యోగం ఇస్తామని టీజీపీఎస్సీ తెలిపింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు నేషనల్ లెవెల్ క్రీడాకారులు. స్పోర్ట్స్ కోటాకు అర్హత సాధించే 1 నుండి 91 లెవెల్స్ క్రీడాకారులకే మిగతా 7 పోస్టులను ఇవ్వాలని తీర్పు ఇచ్చింది నామవరపు రాజేశ్వర్ రావు ధర్మాసనం.

ఈ తీర్పును ధిక్కరిస్తూ 7 పోస్టులను ఓపెన్ కోటాలో మార్చి, ఈ నెల 18న నియామక పత్రాలు ఇవ్వనున్నారు రేవంత్ రెడ్డి. కోర్టు నుండి తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, తమ పోస్టులను తమకే కేటాయించాలని క్రీడాకారులు లేఖ రాసినా స్పందించలేదు టీజీపీఎస్సీ. కోర్టు నుండి తమకు న్యాయం జరిగినా, రేవంత్ రెడ్డి మాత్రం తమ అవకాశాలను కొల్లగొడుతున్నాడని నేషనల్ లెవెల్ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:సుప్రీం కోర్టులో రేవంత్‌కు బిగ్ షాక్

- Advertisement -