రజినీకాంత్ సూపర్ స్టార్ హీరో అయినా ఆయనకు ఆధ్యాత్మిక వాదిగా జీవించడం ఎంతో ఇష్టం. అందుకే తన ఆస్తులు, హోదాపై కూడా ఆయన ఏనాడు మమకారం పెంచుకోలేదు. తన తదనంతరం ఆస్తులన్ని ప్రజలకే చెందుతాయని రజినీ వీలునామా కూడా రాసినట్లు ఓ వార్త ప్రచారంలో కూడా ఉంది.
మరోసారి ఆయన ఇలాంటివే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆస్తులు, హోదా కంటే ఆధ్యాత్మికతను స్వీకరించడానికే తాను ఇష్టపడతానని తెలిపారు. ఆధ్యాత్మికంలోనే ఎక్కువ ‘శక్తి’ ఉందన్నారు నరసింహా చిత్రం తర్వాత నటించకూడదనుకున్నాను. కానీ బాబా గురించిన విశేషాలు ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో ‘బాబా’లో మళ్లీ నటించానని రజనీకాంత్ తెలిపారు.
ఆ సినిమా పెద్దగా ఆడక పోయినా ఆవేదన చెందలేదన్నారు. బాబా సినిమా భారీగా నష్టాలు తేవడంతో…. రజనీకాంత్ డిస్ట్రిబ్యూటర్లకు తన సొంత డబ్బు ఇచ్చి ఆదుకున్నారు. ఆ సినిమా నష్టాల నుండి బయట పడటానికి మళ్లీ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు రజనీకాంత్. చెన్నైలో జరిగిన పరమహంస యోగానంద రచించిన ‘దైవీగ కాదల్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేసారు.