హైదరాబాద్ టెస్టులో కోహ్లి సేన గ్రాండ్ విక్టరీ

199
Spinners, Ishant wrap up 208-run win
- Advertisement -

హైదరాబాద్ ఉప్పల్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న ఏకైక టీ 20 మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. పసికూనపై 208 పరుగుల తేడాతో గెలుపొందింది. 459 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 250 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజు 103/3తో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. స్పీన్‌కు తోడుగా ఇషాంత్ పేస్ బౌలింగ్ తోడవటంతో బంగ్లా బ్యాట్స్ మెన్ విలవిల లాడిపోయారు. బంగ్లా కీలక ఆటగాళ్లు మహ్మదుల్లా 64, సౌమ్యా సర్కార్ 42 పరుగులతో జట్టును డ్రా దిశగా నడిపించాలని భావించినా టీమిండియా బౌలర్లముందు వారి పప్పులు ఉడకలేదు.

దీంతో 100.3 ఓవర్లలో బంగ్లా 250 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో అశ్విన్‌, జడేజా తలో 4 వికెట్లు తీయగా ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీశారు. డబుల్ సెంచరీతో రాణించిన టీమిండియా కెప్టెన్‌ కోహ్లికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు లభించింది.

భారత్ తొలి ఇన్నింగ్స్‌ :687/6

రాహుల్(1), విజయ్(108), సీఏ పుజారా(83), కోహ్లి(204), రహానే(82), సాహా(106 నాటౌట్), అశ్విన్(34), జడేజా(60 నాటౌట్)

బంగ్లా తొలి ఇన్నింగ్స్‌:388 ఆలౌట్‌

తమీమ్ ఇక్బాల్(24), సౌమ్య సర్కార్(15), మోమినుల్(12), మహ్మదుల్లా(28), షకీబ్ అల్ హసన్(82), ముషఫిర్ రహ్మన్(127), షబ్బీర్ రహ్మన్(16), మెహదీ హసన్(51), తయిజుల్(10), తస్కిన్(8), కమ్రుల్(0 నాటౌట్)

భారత్ రెండో ఇన్నింగ్స్ :159/4

 విజయ్(7), రాహుల్(10), పుజారా(54 నాటౌట్), కోహ్లీ(38), రహానే(28), జడేజా(16 నాటౌట్)

బంగ్లా రెండో ఇన్నింగ్స్‌:250 ఆలౌట్

తమిమ్(3), సౌమ్య సర్కార్(42), మోమినుల్(27), మహ్మదుల్లా(64), షకీబ్(22), ముషపీర్(23), షబ్బీర్(22), మెహది హసన్ మీర్జా(23), కమ్రుల్ హసన్(3 నాటౌట్), ఇస్లాం(6), తస్కిన్ అహ్మద్(1)

- Advertisement -