స్పెర్మ్ కౌంట్ తగ్గితే.. ప్రమాదమే?

18
- Advertisement -

స్త్రీ పురుషుల కలయికలో పిల్లలు పుట్టేందుకు పురుషుల్లోని శుక్రకణాలు ఎంతో ముఖ్యమైనవి. వీటి సంఖ్య ఏ మాత్రం తగ్గిన లేదా యాక్టివ్ గా లేకపోయినా పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ. అయితే నేటి రోజుల్లో చాలమంది దంపతులు సంతనలేమితో బాధపడుతున్నారు. ఈ సమస్యకు ప్రధాన కారణం పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడమే. వీర్యకణాలు తక్కువగా ఉండడం వల్ల పురుషుల్లో శృంగార కోరికలు మందగిస్తాయి. తద్వారా జీవిత భాగస్వామిని తృప్తి పరచడంలో విఫలం అవుతుంటారు. అయితే కేవలం ఈ సమస్యలు మాత్రమే కాకుండా స్పెర్మ్ కౌంట్ తగ్గితే పురుషుల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందట. సాధారణంగా పురుషుల్లోని ఒక మిల్లీ లీటర్ వీర్యంలో 1.5 మిలియన్ కంటే ఎక్కువ వీర్యకణాలు ఉండాలి. అంతకంటే తక్కువగా ఉండేవారిలో పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువ.

అంతేకాకుండా ఎముకల క్యాన్సర్, కీళ్ల క్యాన్సర్ కు గురయ్యే ప్రమాదం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నవారిలో టెస్టీకల్ క్యాన్సర్ ఉండే అవకాశం కూడా ఉందట. కాబట్టి లో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయిచ్చుకొని సరైన మెడిసన్ వాడాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం తినే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం. కాబట్టి ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, తాజా పండ్లు వీర్య వృద్దిని పెంచడంలో సహాయ పడతాయి. దానిమ్మ, అరటి పండు, క్యారెట్, గుమ్మడి గింజలు, వాల్ నట్, వెల్లుల్లి.. వంటివి బాగా తినాలి. ఇంకా ధూమపానం, మద్యపానం, వంటి చెడు అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి. ఈ అలవాట్ల కారణంగా వీర్యకణాల నాణ్యత దెబ్బ తినడంతో పాటు వాటి సంఖ్య కూడా తగ్గుతుంది. కాబట్టి స్పెర్మ్ కౌంట్ కౌంట్ ను సమతుల్యం గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

Also Read:Allu Arjun:పుష్ప 2 వెనక్కి తగ్గాల్సిందేనా?

- Advertisement -