టీ20 వరల్డ్ కప్ ఫైనల్..స్పెషల్ ట్రైన్స్

3
- Advertisement -

టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లే అభిమానుల కోసం భారత రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించింది. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్–న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ నుంచి సబర్మతి వరకు ప్రత్యేక రైలు నడపనున్నారు.

నార్తర్న్ రైల్వే ప్రకారం, ట్రైన్ నెంబర్ 04062 మార్చి 7న రాత్రి 11:45 గంటలకు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు సబర్మతి చేరుకుంటుంది. ఈ రైలు ఢిల్లీ కాంట్, గురుగ్రామ్, జైపూర్ మార్గంగా ప్రయాణిస్తుంది. మొత్తం 19 ఎసీ కోచ్‌లు ఉండగా, వీటిలో థర్డ్ ఎసీ మరియు సెకండ్ ఎసీ కోచ్‌లు ఉన్నాయి.

ఫైనల్ మ్యాచ్ టికెట్లు ఆలస్యంగా విడుదల కావడంతో చాలా మంది అభిమానులు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోలేకపోయారు. విమాన టికెట్ల ధరలు కూడా భారీగా పెరగడంతో అభిమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైల్వే ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది.

Also Read:ఊబకాయంతో క్యాన్సర్ ముప్పు?

ఇక భారత జట్టు మార్చి 6న అహ్మదాబాద్‌కు చేరుకుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననుంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సాధన చేయనుంది. వారి ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యాహ్నం 1:30 గంటలకు జరుగుతుంది.

- Advertisement -