‘ఎన్టీఆర్ 30’ కోసం ప్రత్యేక సెట్

52
- Advertisement -

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాలతో సినిమా చేస్తున్న‌ విష‌యం తెలిసిందే. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాలో పోరాటమే చేస్తున్నారు. వారి కోసం ఈ సినిమా షూటింగ్ గురించి ఓ క్రేజీ అప్ డేట్ ను రివీల్ చేస్తున్నాం. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తవగా.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక సెట్‌లో వరుసగా 10 రోజుల పాటు షూటింగ్ జరపనున్నారు. ఈ కొత్త షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు జాన్వీ కపూర్ కూడా పాల్గొననుంది.

ఇంతకీ ఈ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా?, వచ్చే వారం నుంచి స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ కోసం ఎన్టీఆర్‌ తన లుక్ ను కూడా పూర్తిగా మార్చనున్నాడు. అన్నట్టు పది రోజుల షూటింగ్ లో చివరి నాలుగు రోజుల పాటు ఇతర నటీనటులతో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారట. ఇక కొరటాల శివ కథకే కాదు, కథ జరిగే నేపథ్యానికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో జరగనుంది. సినిమాలో విజువల్స్ అదిరిపోతాయట.

Also Read: హిట్ కొట్టినట్టే.. ఫస్ట్ డే 9 కోట్లు

ముఖ్యంగా సముద్రంలో జరిగే యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తాయట. కేవలం ఈ సీక్వెన్స్ లను దృష్టిలో పెట్టుకునే హాలీవుడ్ స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ను ఈ సినిమాకు తీసుకున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 5, 2024న విడుదల చేయనున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతున్న ఈ అంతర్జాతీయ మూవీని కొరటాల శివ కసితో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: పిక్ టాక్ : సొగసుల గుమగుమలండోయ్

- Advertisement -