బతుకమ్మకు ప్రత్యేక రంగు చీర

295
bathukamma
bathukamma
- Advertisement -

రాష్ట్ర సర్కారు బతుకమ్మ పండుగను సరికొత్త పంథాలో ఆకర్షణీయంగా నిర్వహించబోతుంది. గతేడాది కేటాయించిన రూ.10 కోట్ల బడ్జెట్‌ను ఈసారి సీఎం కేసీఆర్ రూ.15 కోట్లు పెంచి మంజూరు చేశారు. అందులో బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రతి జిల్లాకు రూ.10 లక్షలు కేటాయించారు. ప్రతి గ్రామంలో బతుకమ్మ పండుగ కళ కనపడేలా చేయనున్నారు.

Bathukamma

ఊరూవాడే కాదు.. అందరూ బాగుండాలని చేసుకునేది బతుకమ్మ పండుగ. తెలంగాణ రాష్ట్ర పండుగ కూడా. ఈ చారిత్మక పండుగకు ఈసారి సరికొత్త శోభ సంతరించుకోనుంది. బతుకమ్మ చీరను తీసుకురావాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అక్టోబర్ 6 నుంచి 15వ తేదీ వరకు ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నారు. ఈ సాంస్కృతి కార్యక్రమానికి అందరూ ఒకే రకమైన చీర ధరలించే విధంగా బతుకమ్మ చీర తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.

Onam

కేరళీయుల గ్రామీణ పండుగ ఓనంను అక్కడి ప్రజలు పదిరోజులపాటు చూడముచ్ఛటగా జరుపుకొంటారు. ఈ పండుగను నేరుగా తిలకించేందుకు విదేశీయులు సైతం హాజరు అవుతారు. సర్కారు కూడా ఈసారి తిరువనంతపురంలో ఓనం పండుగ ఎలా నిర్వహిస్తారో అలాగే వినూత్నంగా హైదరాబాద్‌లో నిర్వహించాలని సంకల్పించింది. కేరళ మహిళలు ‘కసవు చీరలు’ ధరించి పండుగ ఉత్సవాల్లో భాగస్వాములు అవుతారు. అదే తరహాలో ఇక్కడ కూడా బతుకమ్మ పండుగలో మహిళలు తెలంగాణ విశిష్ఠతను యాది చేసే ప్రత్యేక రంగుతో కూడిన చీరను తీసుకురానున్నారు. ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో అధికారిక నిర్ణయం రానున్నట్లు సమాచారం.

- Advertisement -