హైదరాబాద్ నగరంతోపాటు, ఇతర పట్టణాల్లో పార్కింగ్ కోసం ప్రత్యేకమైన పాలసీ తీసుకురానున్నట్లు పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖాధికారులతో ఈ మేరకు సమావేశం నిర్వహించారు. నగరంలోని ప్రజలకు ప్రధానంగా పార్కింగ్, రోడ్ల నిర్వహణ లోపాల వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటిని తోలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే పలు దఫాలుగా రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్లు, మున్సిపల్ శాఖా అధికారులతో పార్కింగ్ పాలసీ రూపకల్పనపైన సమావేశాలు నిర్వహించామన్నారు. ఈ మేరకు రూపొందించిన పార్కింగ్ పాలసీ డ్రాప్ట్ పైనా చర్చించారు.
రోడ్లపైన వాహనాలు తిరిగేందుకు నిర్ధారించిన మార్గాన్ని( carriage way) కాపాడడం, రద్దీని తగ్గించడం ప్రధాన లక్ష్యాలుగా ఈ పాలసీ ఉంటుందన్నారు. నగరంలోని ప్రణాళిక బద్దమైన అభివృద్ది దిశగా తీసుకుకెళ్లేందుకు ఈ పార్కింగ్ పాలసీ ఉపయోగపడుతుందన్నారు. నగరంలో మల్టీ లెవల్ పార్కింగ్ ఎర్పాట్లతో పాటు ఖాళీ ప్రదేశాల్లోను పార్కింగ్ సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఈ మేరకు ఖాళీ ప్రదేశాల యాజమాన్యాలను చైతన్యవంతం చేసేలా అధికారులు ప్రయత్నాలు చేయాలన్నారు.
ఈ మేరకు పార్కింగ్ కోసం ముందుకు వచ్చే వారికి పలు ప్రొత్సాకాలను ఇస్తామన్నారు. నూతనంగా భవనాలు నిర్మాణం చేసేవారు పార్కింగ్ కోసం నిర్దారిత పార్కింగ్ కన్నా అధికంగా పార్కింగ్ కల్పిస్తే వారికి భవన నిర్మాణ అనుమతుల్లో కొన్ని సడలింపులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. గతంలో పార్కింగ్ కోసం ఉద్దేశించిన ప్రదేశంలో నిర్మాణాలు చేసిన కాంప్లెక్స్ ల్లో కూల్చివేతలు వేంటనే చేపట్టాలని ఛీప్ టౌన్ ప్లానింగ్ అఫీసర్ కు అదేశాలిచ్చారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు.
నగరంలోని ట్రాపిక్ తగ్గించగలిగే మెట్రో రైలు ప్రాజెక్టులోనూ పార్కింగ్ అంశాన్ని పరిగణలోకి తీసుకుని వినూత్నమైన పరిష్కారాలు వెతకాలన్నారు. ప్రస్తుతం ఉన్న మెట్రో స్టేషన్లతో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా వాటికి అనుభందంగా మల్టీ లెవల్ పార్కింగ్లు, స్కైవాక్స్ సరిపోయినంతగా కట్టలన్నారు. ప్రస్తుతం నగర రోడ్లపై పుట్ ఒవర్ వంతెనలు తక్కువగా ఉన్నాయని, ఈ సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉన్నది. ఈ వంతెనల నిర్మాణంలో అధునాతన నిర్మాణ అంశాలను పరిగణలోకి తీసుకుని, పోలీస్, ట్రాఫ్రిక్ పోలీసులతో కలసి సమగ్రమైన ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఈ ప్రణాళిక కోసం ట్రాపిక్ నిపుణులను వినియోగించుకోవాలన్నారు.
ఈ సమావేశంలో హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, నగర పోలీస్ కమీషనర్, జియచ్ యంసి, హెచ్ యండిఎ, కమీషనర్లు, మెట్రోరైల్ యండి, ఇతర పొలీస్ ఉన్నతాధికారులు పాల్గోన్నారు.