కబాలి తర్వాత సాహోనే…..!

713
prabhas
- Advertisement -

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కబాలి అందరికి గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమా విడుదల సమయంలో కబాలి ఫీవర్ తో యావత్ దేశం రజనీ మేనియాతో ఉగిపోయింది.అంతేగాదు  సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఏకంగా సెలవులు ప్రకటించగా ఎయిర్ ఏషియా ఒకడుగు ముందుకేసి కబాలి పోస్టర్‌తో ప్రయాణీకులకు ఆకట్టుకుంది.

kabali

సీన్ కట్ చేస్తే ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా ప్రమోషన్స్‌కి ప్రత్యేక ఫ్లైట్‌ని వాడుతున్నారు. ఆగస్టు 30న ఈ సినిమా తెలుగు,తమిళ,మలయాళ,హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా ఇప్పటికే ప్రమోషన్స్‌లో మునిగి తేలుతోంది చిత్రయూనిట్.

ముంబై, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ప్రమోషన్స్ చేయగా బిజీ షెడ్యూల్‌లో  మరిన్ని ప్రాంతాలు తిరిగేందుకు ఛార్టెడ్ ఫ్లైట్‌ను బుక్ చేశారు. ప్రభాస్ సహా ఎంటైర్ యూనిట్ ఈ స్పెషల్ ఫ్లైట్‌లోనే ట్రావెల్ చేస్తున్నారట.రూ.350కోట్లతో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

- Advertisement -