TTD: కోదండ‌రామాల‌యంలో విశేష ఉత్స‌వాలు

0
- Advertisement -

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జనవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.

• జనవరి 4, 11, 18, 25వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

• జనవరి 10న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

• జనవరి 13న పౌర్ణమి సందర్భంగా ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.

• జనవరి 14న పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.

• జనవరి 29న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. రాత్రి 7 గంట‌ల‌కు హ‌నుమంత వాహ‌న‌సేవ నిర్వ‌హిస్తారు.

Also Read:భారీ అంచనాలతో ‘మ్యాడ్ స్క్వేర్’

- Advertisement -