కర్ణాటక సీఎం సిద్దరామయ్య మెడకు ఉచ్చు బిగుస్తోంది. ముడా కేసులో సీఎం సిద్దరామయ్యపై విచారణకు కర్ణాటక లోకాయుక్త ఆదేశించింది. సామాజిక కార్యకర్త అయిన పిటిషన్ స్నేహమయి కృష్ణ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ప్రైవేటు పిటిషన్ వేశారు.
లోకాయుక్త ముడా కుంభకోణంపై విచారణ జరిపి మూడునెలల్లో నివేదిక సమర్పించనున్నారు. పిటిషన్ కృష్ణ తరఫున న్యాయవాది లక్ష్మీ అయ్యంగార్ విలేకరులతో మాట్లాడుతూ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. లోకాయుక్త విచారణ మొదలయ్యే వరకు వేచి ఉండాలన్నారు. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి విచారణ ప్రారంభిస్తారేమో వేచి చూడాలన్నారు.
తనపై విచారణకు గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టును పిటిషనర్ స్నేహమయి కృష్ణ ఆశ్రయించగా.. ఈ మేరకు న్యాయమూర్తి విచారణకు ఆదేశించారు.
Also Read;KTR : దేవర ప్రీ రిలీజ్ రద్దుపై కేటీఆర్