ఖైదీ పై పుస్తకం..

249
Ram Charan
- Advertisement -

టాలీవుడ్ కి ప్రతిష్టాత్మకంగా రాబోతున్నచిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150. దాదాపు 8ఏళ్ల తర్వా మెగాస్టార్ హీరోగా నటించడంతో ఖైదీపై టాలీవుడ్ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్‌..సాంగ్ ఇప్పటికే తెగ సందడి చేస్తోంది. భారీ అంచనాలకు తగ్గట్టుగానే ప్రమోషన్ విషయంలో చిత్రయూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతీ విషయంలో అభిమానులను దృష్టిలో పెట్టుకొని అడుగులు వేస్తున్నారు.

Ram Charan

ఇప్పటికే టీజర్, మేకింగ్ వీడియోలతో ఆకట్టుకున్న ఖైదీ టీం, త్వరలో ఈ సినిమా షూటింగ్ అనుభవాలతో ఓ పుస్తకాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ పుస్తకంలో ఖైదీ నంబర్ 150 సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల అనుభవాలను ప్రచురించనున్నారు. ఇప్పటికే ప్రింటింగ్ పనులు కూడా మొదలయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు మెగా టీం.

తమిళ సూపర్ హిట్ సినిమా కత్తికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు వివి వినాయక్ దర్శకత్వం అందించాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్ పాత్రలో కనిపించనున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో డిసెంబర్ 25న మార్కెట్లోకి విడుదలవుతోంది.

- Advertisement -