ఈ ఏడాది తరచూ వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎలాన్ మస్క్. ట్విట్టర్ కొనుగోలు దగ్గరి నుండి దాని పేరు ఎక్స్‌గా మార్చడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా నిలవడం వరకు మస్క్ పేరు ప్రపంచమంతా మార్మోగిపోయింది. ఇక ఇది ఇలా ఉండగానే అంతరిక్ష ప్రయోగాల ఖర్చులను తగ్గించడం, వేగవంతం చేయడంలో ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్పేస్‌ఎక్స్ (SpaceX) కీలక ముందడుగు వేసిన సంగతి తెలిసిందే.
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ …స్టార్‌షిప్ రాకెట్ బూస్టర్‌ను, ల్యాంచ్‌ప్యాడ్‌లోని లాంచ్ టవర్‌పైనే రీలాంచ్ చేసింది. ఐదో టెస్ట్ ఫ్లైట్ సమయంలో, సూపర్ హెవీ రాకెట్ బూస్టర్ విజయవంతంగా లాంచ్ ప్యాడ్‌ని తిరిగి చేరుకుంది.
గతంలో కూడా స్పేస్ ఎక్స్ కంపెనీ రాకెట్ బూస్టర్లను రీయూజ్ చేసేది. కానీ అవి సముద్రాల్లోని ఓషన్ ప్లాట్‌ఫామ్‌లలో లాంచ్ అయ్యేవి. వాటిని లాంచ్‌ప్యాడ్‌కు తీసుకొచ్చేందుకు భారీ ఖర్చు అయ్యేది. తాజా ప్రయోగంతో నేరుగా లాంచ్ ప్యాడ్‌లో రాకెట్ బూస్టర్‌ను స్పేస్‌ఎక్స్ రీలాంచ్ చేసింది. ఇలాంటి ప్రయోగం సక్సెస్ అవ్వడం ఇదే మొదటిసారి.
సూపర్ హెవీ బూస్టర్‌ను మెకానికల్ ఆర్మ్స్ పట్టుకోవడంతో పాటు, స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ అప్పెర్ స్టేజ్‌ను సబ్‌ఆర్బిటల్ ఫ్లైట్‌లో పంపింది. ప్రయోగించిన 65 నిమిషాల తర్వాత హిందూ మహాసముద్రంలో నియంత్రిత ల్యాండింగ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మిషన్ విజయవంతం కావడం అంతరిక్ష పరిశోధన రంగంలో ఉత్సాహాన్ని సృష్టించింది.
Also Read:తెలుగు రాష్ట్రాల్లో భూకంపం..5.3గా భూకంప తీవ్రత
స్పేస్ ఎక్స్ ద్వారా ప్రయాణ మార్గాన్ని సులభం చేయడం, తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేలా ఒక ప్రాజెక్టను కూడా తీసుకురాబోతున్నారు మస్క్.
ఇది విజయవంతమైతే ప్రపంచంలోని ఏ ప్రధాన నగరానికైనా గంటలోపే చేరుకోవచ్చు. ఢిల్లీ నుంచి కేవలం అరగంటలో అమెరికా చేరుకోవచ్చు. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ సహాయంతో ప్రయాణీకులు క్షణాల్లో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరుకోగలుగుతారు. ఈ వ్యోమనౌక దాదాపు 395 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో దాదాపుగా వెయ్యి మంది దాకా ఒకేసారి ప్రయాణించ వచ్చు.