Spearmint:పుదీనా రసం మంచిదేనా?

57
- Advertisement -

వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే సుగంధద్రవ్య మొక్కలలో పుదీనా ఒకటి. ఇది వంటలకు సువాసన కలిగించడంతోపాటు చక్కటి రుచిని కూడా అందిస్తుంది. చికెన్, మటన్, కూరగాయల కర్రీ, చట్నీ.. ఇలా వంటకం ఏదైనా పుదీనా ఉపయోగిస్తే వాటి రుచి మరింత పెరుగుతుంది. పుదీనాను కేవలం వంటల్లోనే కాకుండా ఇతరత్రా పానీయాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా లెమన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, మజ్జిగ, ఫ్రూట్ మిక్సర్.. ఇలా రకరకాల పానీయాలతో కలిపి కూడా సేవిస్తూ ఉంటారు. పుదీనాను నిత్యం తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, బి, సి, ఇ.. వంటి వాటితో పాటు కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, వంటి సూక్ష్మ పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. అయితే పుదీనాను ఆకుల రూపంలో కంటే రసంగా తీసుకుంటే ఎంతో మేలని చెబుతున్నారు ఆయుర్వేద పనులు. పుదీనా రసం ప్రతిరోజు సేవించడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయట. ప్రతిరోజు ఉదయం పడగడుపున పుదీనా రసం తాగడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయట.

ఇంకా పుదీనా రసాన్ని నోట్లో వేసుకుని పుక్కలించడం వల్ల నోటి దుర్వాసన సమస్య దూరం అవుతుంది. పుదీనాలో కెరోటిన్, సెలిసైక్లిక్ యాసిడ్ వంటి వాటితో పాటు సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. కాబట్టి పుదీనా రసాన్ని ప్రతిరోజు సేవించడం వల్ల ఆర్థరైటిస్ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా శరీరంలోని పేరుకుపోయిన కొవ్వును తొలగించి లివర్ కిడ్నీల పనితీరును కూడా మెరుగుపరుస్తుందట. ఇంకా పుదీనాకు ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల కారణంగా సీజనల్ గా వచ్చే వ్యాధులను నివారిస్తుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజు పుదీనా రసాన్ని సేవిస్తే సులువుగా బరువు తగ్గవచ్చు. ఎందుకంటే పుదీనాలో ఉండే ఔషధాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి దోహదం చేస్తాయి. కాబట్టి పుదీనా రసాన్ని క్రమం తప్పకుండా సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also Read:TTD:సుందరరాజస్వామి అవతార మహోత్సవాలు

- Advertisement -