భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. నిమ్స్‌లో రెండో డోస్ తీసుకున్న అనంతరం మాట్లాడిన పోచారం…కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రయత్నించాలన్నారు. ఇవాళ రెండవ డోస్ తీసుకున్నాను…మార్చి 3 న మొదటి డోస్ తీసుకున్నా అని తెలిపారు. మంచిగా ఉన్నాం.. నొప్పి లేదు.. ఫీవర్ లేదు.. ఎలాంటి రియాక్షన్ లు లేవన్నారు.
భారత్ బియోటెక్ కోవాగ్జిన్ తీసుకున్నాం… నిమ్స్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. 45 సవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న పోచారం..యాంటీ బాడీస్ డెవలప్ అయితే… కరోనా వచ్చినా లైట్ గా వస్తుందన్నారు. మాస్క్ లేకుండా ఎవరు బయటకు రావొద్దని…వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండకండన్నారు.
రెండవ డోస్ లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. వ్యాక్సిన్ తో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని…వైరస్ ను లైట్ తీసుకుంటున్నారు…మాస్క్ లేకుండా తిరగవద్దు… ప్రభుత్వం పెట్టిన నిబంధనలను పాటించాలన్నారు. ఈ సందర్భంగా నిమ్స్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

