స్పీకర్ పోచారం భావోద్వేగం..

193
pocharam
- Advertisement -

స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. బాన్సువాడ‌లో అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో భేటీ అయిన పోచారం…ప‌క్కా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారంటూ జ‌డ్పీటీసీ స‌తీశ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా భావోద్వేగం ఆపుకోలేక‌పోయిన స్పీక‌ర్‌….కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ సంద‌ర్భంగా నిజాం సాగార్ ప్రాజెక్టు నుంచి కాల్వ‌ల ద్వారా విడ‌త‌ల వారీగా నీటిని విడుద‌ల చేస్తామ‌ని ఆయ‌న చెప్పారు. మొదటి విడతలో 1200 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని వెల్లడించారు. మొదటి విడత 20 రోజులు, తరువాత 5 విడతలను 10 రోజుల చొప్పున విడుదల చేస్తాం అన్నారు. నియోజకవర్గం పరిదిలోని రైతులు ఇప్పటికే బోర్లు, బావుల క్రింద నార్లు పోసుకున్నారు.

రైతులు తమ వంతు బాద్యతగా నీటిని పొదుపుగా, అవసరమైన వరకే వాడుకోవాలి, వృదా చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు పోచారం. కాలువల పై బాగంలో ఉన్న రైతులు నీటిని వృదా చేయకుండా పర్యవేక్షణ అవసరం అన్నారు.

- Advertisement -