ఘనంగా 70వ రాజ్యాంగ దినోత్సవం..

721
speaker pocharam
- Advertisement -

భారతదేశ 70 వ రాజ్యాంగ దినోత్సవాన్ని తెలంగాణ అసెంబ్లీలో ఘనంగా నిర్వహించారు. డా.బి ఆర్ అంబేద్కర్ , మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన పోచారం వివిధ రాజ్యాంగ సంస్థలలో భారత 70 వ రాజ్యాంగ దినోత్సవం ను ఘనంగా జరుపుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

డా. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రూపురేఖలు దిద్దిన అనంతరం మనమంతా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి తోనే అందరం కలిసి పని చేస్తున్నాం.ఇది చాలా గొప్ప విధానం అన్నారు. రాజ్యాంగంలో ఇప్పటికి 103 సవరణలు జరిగి , దీనిని పార్లమెంట్ ఆమోదించిందన్నారు. ప్రజల కొరకు పని చేసే ప్రభుత్వాలే నిజమైన ప్రభుత్వాలు….రాజ్యాంగం స్ఫూర్తి తోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పనులు చేస్తున్నారని చెప్పారు.

pocharam

ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మంత్రులు హరీష్ రావు , మహమ్మద్ అలీ , ఈటెల రాజేందర్ , వేముల ప్రశాంత్ రెడ్డి , గంగుల కమలాకర్ , సబితా ఇంద్రారెడ్డి , మల్లారెడ్డి , జగదీశ్వర్ రెడ్డి , కొప్పుల ఈశ్వర్ , సత్యవతి రాథోడ్ , ఎర్రబెల్లి దయాకరరావు …ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ఎం.ఎల్.ఏ లు జైపాల్ యాదవ్ , బేతి సుభాష్ రెడ్డి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి , శాసన సభ పరిషత్ ఉపాధ్యక్షులు నేతి విద్యా సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Telangana speaker pocharam srinivas reddy speech at 70th indian constitution day ..Telangana speaker pocharam srinivas reddy speech at 70th indian constitution day ..

- Advertisement -