ముత్యంరెడ్డి..అందరివాడు: స్పీకర్ పోచారం

678
pocharam
- Advertisement -

ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేసిన గొప్పనాయకుడు చెరుకు ముత్యంరెడ్డి అని తెలిపారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. సిద్దిపేట జిల్లా తొగుటలో ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించిన స్పీకర్‌…కుటుంబ సభ్యులను ఓదార్చారు. ముత్యంరెడ్డితో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

ముత్యంరెడ్ది మరణవార్త ఆయన అభిమానులతో పాటు మా అందర్నీ కూడా కలచివేసిందన్నారు. ప్రజాప్రతినిధిగా ఎలా ఉండాలో నూటికి నూరు పాళ్లు నిరూపించిన వ్యక్తి అని ప్రజలకు ఏ విదంగా సేవ చేయాలి, ఆ ప్రాంత అభివృద్ధి ఏమిటి అని ఎల్ల వేళలా ఆలోచించే కొంతమంది వ్యక్తులలో ముత్యంరెడ్ది ఒకరని చెప్పారు.

రాజీ లేని వ్యక్తిగా రాజకీయంలో పని చేశారు…ముత్యంరెడ్ది మరణం ఉమ్మడి మెదక్ జిల్లాకు, రాష్ట్రానికి లోటు అన్నారు. పని, ప్రజలు, అభివృద్ధి తప్ప వేరే ధ్యాస లేకుండా పని చేసేవారని…ముత్యంరెడ్ది తో అనేక సంవత్సరాలుగా దగ్గరి సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

శాసనసభలో కలసి పని చేశాం… ప్రతిపక్షాలు కూడా మెచ్చుకునే స్థాయిలో పని చేశారు… రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్ష పదవిని నిజమైన రైతు ముత్యంరెడ్ది కి అప్పగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. ముత్యంరెడ్డి జీవించి ఉండి ఉంటే రాష్ట్రస్థాయిలో అత్యున్నతమైన పదవి లభించేదని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెప్పారు.

- Advertisement -