అంబులెన్స్ లను ప్రారంభించిన స్పీకర్ పోచారం..

184
Speaker pocharam

రాష్ట్ర పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రి కేటి రామారావు జన్మదినం సందర్భంగా చేపట్టిన “గిఫ్ట్ ఎ స్మైల్” కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు అందించిన అంబులెన్స్ లను జెండా ఊపి ప్రారంభించారు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. పబ్లిక్ గార్డెన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కేటి రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్ మరియు పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు.