కరోన వైరస్ నిర్ములన, పాజిటివ్ వచ్చిన వ్యక్తుల చికిత్స కొరకు తమ వేతనం నుండి 75 శాతం సొమ్ముని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్.
శాసన సభల అధిపతులు అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి తమ దయ గుణాన్ని చాటుకున్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోన వైరస్ నిర్ములన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి తోడుగా నిలిచారు.
మార్చ్, ఏప్రిల్ నెలకి చెందిన తమ వేతనంలోంచి 75 శాతం జీతాన్నిని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. గుత్తా సుఖేందర్ రెడ్డి 5,26,500 రూపాయలు మరియు పోచారం శ్రీనివాస్ రెడ్డి 5,26,500 రూపాయల చెక్ లను అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహ చార్యులు ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.ఆయన ఈ చెక్ లను ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డికి అందజేశారు.