తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో వివేకానంద విదేశీ విద్య పథకం కింద ఎంపికైన విద్యార్థులకు మంజూరు పత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మి కాంతరావు ముఖ్య అథితిలుగా హాజరైయ్యారు. ఎమ్మెల్సీ పురాణం సతీష్,ఢిల్లీలో ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల చారి, రమణ చారి, సీఎం సీపీఆర్వో జ్వాల నర్సింహారావు,ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రమణ చారి ప్రభుత్వ సలహాదారు,బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ.. బ్రాహ్మణ పరిషత్ 54 మందికి 10 కోట్ల 80 లక్షలు మంజూరు పత్రాలు అందజేసింది.అప్లై చేసుకునే వాళ్లు అన్ని అప్లికేషన్లు ఆన్లైన్‌లో అప్లై చేసుకోవాలి. వచ్చే నేల 20వ తేదీ వరకు అన్ని పథకాలు అప్లై చేసుకోవచ్చు. విదేశీ విద్యకు వెళ్లే విద్యార్థులకు 20 లక్షల ఆర్ధిక సహాయం చేస్తున్నామని రమణ చారి అన్నారు. అప్లికేషన్లు తక్కువ వచ్చిన జిల్లాల నుండి మరిన్ని అప్లికేషన్లు రావాలి.అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి. అమెరికాకు 27 మంది వెళ్తున్నారు, ఆస్ట్రేలియా కి 12 మంది,కెనడా 8 మంది,ఫ్రాన్స్1,జర్మనీ 4 యూకే 2 వెళ్తున్నారని రమణ చారి తెలిపారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..
సరస్వతి ఉన్న దగ్గరే లక్ష్మీ ఉంటుంది, సమాజంలో గౌరవం పొందే వ్యక్తి విద్యావంతులు మాత్రమే అని పోచారం అన్నారు. ఎన్ని డబ్బులు ఉన్న వేదికపై కి పిలువరు,కానీ సరస్వతి పుత్రుడుని వేదికపైకి పిలుస్తారు. బ్రహ్మణులలో కూడా పేద బ్రాహ్మణులు ఉంటారు అని గుర్తించిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణుల సంక్షేమ కోసం ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ సందర్భంగా స్పీకర్ తెలిపారు.
తెలంగాణ గడ్డపై నివసించే ప్రతి వ్యక్తి సంతోషంగా జీవిస్తేనే బంగారు తెలంగాణ, తెలంగాణ ప్రజల మోహల్లో చిరునవ్వు చూసినప్పుడు బంగారు తెలంగాణ సాధ్యం అని సీఎం కేసీఆర్ ఆలోచన.ఆయన ఏ కార్యక్రమం చేసిన ఎదో అర్థం ఉంటుంది. బ్రాహ్మణ,జర్నలిస్టుల,న్యాయవాదుల సంక్షేమనికి నిధులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కండ్ల లాంటివని పోచారం అన్నారు.
కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చెయ్యడమే లక్ష్యంగా ముందుకు పోతున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కులాలు ,మతాలు సంబంధం లేకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించటం మా ప్రభుత్వం లక్ష్యం.స్వచ్ భారత్ పేరు తోటి దేశవ్యాప్తంగా 700 జిల్లాలలో సర్వే జరిగింది.అయితే రాష్ట్రంలో 6 జిల్లాలు మానవే ముందు ఉన్నాయి. గ్రామపంచాయతీ చట్టం తెచ్చాము ఇక చట్టల్లాలో మార్పు రావాలి.
ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం నిజమైన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే నాయకుడు ప్రజా నాయకుడు.అన్ని మతాలను సమానంగా చూస్తున్నారు. యాదాద్రి గుడి అద్భుతమైన కట్టడాలు జరుగుతున్నాయి.చరిత్రలో నిలిచిపోయే గుడి యాదాద్రి అని ఆయన అన్నారు. పురోహితులకు ఆర్ధిక సహాయం చేస్తున్నాం.. అన్ని గుడులకు ధూపదిప నైవేద్యం కింద రాష్ట్రంలో ఉన్న అన్ని గుడ్లకు అందిస్తున్నాం. మన సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికం కలిగిన వ్యక్తి అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.