ఆరోగ్యమే మహాభాగ్యం: స్పీకర్ పోచారం

275
pocharam
- Advertisement -

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనతో పాటు మన పరిసరాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నారు. మున్సిపల్ శాఖ చేపట్టిన ప్రతి ఆదివారం- పది గంటలకు- పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్న పోచారం…తన ఇంట్లోని పూల కండీల్లో చెత్తను తొలగించారు.

ఇంట్లోని నిల్వ చెత్తను, మురికి నీటిని తొలగించినట్లయితే దోమలు పునరుత్పత్తి చెందవని…ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన కేటీఆర్‌ని అభినందించారు.

ప్రతి ఒక్కరూ దీనిని సామాజిక కార్యక్రమంగా భావించి ప్రతి ఆదివారం తప్పనిసరిగా నిర్వహించాలని స్పీకర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -