- Advertisement -
పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపింది స్పీకర్ కార్యాలయం. పార్టీ ఫిరాయించారన్న బీఆర్ఎస్ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేలకు స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు విచారణ చేపట్టనున్నారు స్పీకర్.
ఇటీవల నెల రోజుల లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అడ్వకేట్ జనరల్, న్యాయవాదుల సూచనల అనంతరం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు స్పీకర్.
అయితే తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను.. కాంగ్రెస్‌లోకి వెళ్లలేదు అన్నారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను అని స్పీకర్ నోటీసులపై వివరణ ఇచ్చారు.
Also Read:అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..
- Advertisement -

