దొంగల్లా సంతకాలు..వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్!

6
- Advertisement -

వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. వాళ్ల నాయకుడు జగన్ అసెంబ్లీకి రాకుండా ఉంటే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు దొంగల్లా అసెంబ్లీ వచ్చి సంతకాలు చేసి వెళ్తున్నారని మండిపడ్డారు.

ప్రశ్నలు అడగడానికి వారు సభలో ఉండడం లేదని.. ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. సభ్యులు సభకు రావాలని, ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయిన సభ్యులు సగౌరవంగా సభకు రావాలని సూచించారు. హజరు పట్టికలో సంతకాలు చేసి సభకు రాకపోవడం వారి గౌరవాన్ని పెంచదన్నారు.

బాల నాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాధ రెడ్డి, విశ్వేశరరాజులు సభకు రాకుండా సంతకాలు చేసి వెళ్తున్నారని అన్నారు. లోప‌ల స‌భ జ‌రుగుతుంటే బ‌య‌ట రిజిస్ట్రార్ లో సంతకాలు పెట్టి పారిపోతున్నార‌ని.. మీకు ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దని వారికి హిత‌వు ప‌లికారు. ఇప్పటికైనా స‌భ‌కు రావాల‌ని వైసిపి స‌భ్యుల‌కు సూచించారు.

Also Read:బెట్టింగ్ యాప్స్‌.. హీరోలపై కేసు!

- Advertisement -