పీఏసీ కమిటి చైర్మన్ గా అక్బరుద్దీన్ ఓవైసీ

458
Akbaruddin-Owaisi-in-Assembly
- Advertisement -

అసెంబ్లీ కమిటీలను ప్రకటించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. అక్బరుద్దీన్ ఒవైసీని ప్రజాపద్దుల కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో ఎంఐఎం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండటంతో ఈ పదవిని కట్టబెట్టారు సీఎం కేసీఆర్. . పీఏసీ చైర్మన్‌‌కు కేబినెట్ హోదా ఉంటుంది.

దీంతోపాటు మరికొన్ని కమిటీలను కూడా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అంచనాల కమిటీ చైర్మన్‌గా సోలిపేట లింగారెడ్డి, పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ చైర్మన్‌గా ఆశన్నగారి జీవన్‌రెడ్డి,పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యులుగా కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ప్రకాశ్‌గౌడ్, అబ్రహం, శంకర్‌నాయక్, దాసరి మనోహర్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, అహ్మద్ పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్‌లను నియమించారు.

- Advertisement -