- Advertisement -
నైరుతి రుతు పవనాలు రాష్ట్రాన్ని తాకాయి. నిన్న ఏపీని తాకగా ఇవాళ తెలంగాణలోకి ప్రవేశించాయి. నాగర్‌కర్నూలు, గద్వాల, నల్గొండ మీదుగా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
వాస్తవానికి జూన్ రెండో వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశం ఉంటుందని భావించిన ముందుగానే రావడంతో ఎండవేడిమి నుండి ప్రజలు ఉపశమనం పొందారు. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలుచోట్లు నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Also Read:
- Advertisement -