తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఆగమనం…

7
- Advertisement -

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. వారం రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. రాయలసీమ ప్రాంతం ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించాయని, రాగల మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతుండటంతో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు అన్నాయని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

Also Read:హరిహర వీరమల్లు..లిరికల్ అప్‌డేట్!

- Advertisement -