తెలంగాణలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు..

335
southwest monsoon
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలోకి ఈరోజు(జూన్ 11 వ తేదీన) నైఋతి రుతుపవనాలు ప్రవేశించాయి.మధ్య అరేబియా సముద్రం లోని మరికొన్ని ప్రాంతాలు, గోవా లోని మొత్తం ప్రాంతాలు, కొంకన్, మధ్యమహారాష్ట్ర మరియు మరఠ్వాడ లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలు, రాయలసీమ మరియు కోస్తా ఆంధ్రాలో మొత్తం ప్రాంతాలు, దక్షిణ ఒరిస్సాలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఉత్తర బంగాళాఖాతంలో మరి కొన్ని ప్రాంతాలు, నాగాలాండ్, మణిపూర్, మిజోరం మరియు త్రిపురలోని మిగిలిన ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా ప్రాంతాలు, అస్సాం మరియు మేఘాలయ లో మరికొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు విస్తరించాయి.

మధ్య అరేబియా సముద్రం మరియు మహారాష్ట్రలో మరికొన్ని ప్రాంతాలు, తెలంగాణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఉత్తర బంగాళాఖాతంలో మిగిలిన ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కింలోని మొత్తం ప్రాంతాలు, ఒరిస్సాలో మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమబెంగాల్ లో కొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు రాగల 48 గంటలలో విస్తరించే అవకాశం ఉంది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒరిస్సా తీర ప్రాంతాల దగ్గర ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్ది నైఋతి వైపుకు వంపు తిరిగి ఉన్నది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది.దక్షిణ చత్తీస్ గఢ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో 1.5 km ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు, రేపు అనేక చోట్ల ఎల్లుండి చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.ఈరోజు కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీవర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల అత్యంతభారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.రేపు అక్కడక్కడ భారీ నుండి అతిభారీవర్షాలతో పాటు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -