- Advertisement -
నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఎనమిది రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత కేరళలో ముందుగానే రుతుపవనాలు ప్రవేశించడం విశేషం.
గతేడాది మే 30న నైరుతి రుతుపవనాలు రాగా, 2023లో జూన్ 8న ప్రవేశించాయి. మరోవైపు అరేబియా మహాసముద్రంలోఅల్పపీడనం కొనసాగుతుండగా దీని ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ములు గు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశముందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. వాయుగుండం తీవ్రవాయుగుండంగా లేదా తుఫాన్‌గా బలపడవచ్చని చెప్పారు.
Also Read:సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం..
- Advertisement -

