భారత్‌పై సౌతాఫ్రికా అరుదైన రికార్డు

6
- Advertisement -

కోల్‌కతా వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. 124 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 93 పరుగులకే ఆలౌట్ అయింది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 0, కేఎల్ రాహుల్ 1, వాషింగ్టన్ సుందర్ 31, ధ్రువ్ జురేల్ 13, రిషబ్ పంత్ 2, రవీంద్ర జడేజా 18, అక్షర్ పటేల్ 26, కుల్దీప్ యాదవ్ 1 పరుగులు చేయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ ఒక్క పరుగూ చేయలేదు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ 4 వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టాడు. మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్ రెండేసి వికెట్లు తీయగా, ఐడెన్ మార్క్రమ్ ఒక్క వికెట్ పడగొట్టాడు.

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌:159
‘సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: 153
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌:189
భారత్ రెండో ఇన్నింగ్స్‌: 93

ఈ విజయంతో దక్షిణాఫ్రికాపై భారత్‌పై అరుదైన రికార్డు నెలకొల్పింది. తక్కువ టార్గెట్‌ను కూడా నిలబెట్టుకుంటూ విజయం సాధించింది. గతంలో భారత్‌లో 2004/05లో జరిగిన టెస్ట్ మ్యాచులో ఆస్ట్రేలియాకు టీమ్ ఇండియా ఓ టెస్ట్ మ్యాచులో 107 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. అయినప్పటికీ ఆ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించలేకపోయింది. 13 పరుగల తేడాతో భారత్ గెలిచింది. మనదేశంలోనే ఆడి, అతి తక్కువ పరుగుల లక్ష్యం ఇచ్చి గెలిచిన జట్లలో మనదేశమే మొదటి స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా ఇప్పుడు రెండో స్థానంలో నిలిచింది.

Also Read:ప్రభాస్…షాకింగ్ న్యూస్!

- Advertisement -