టీమిండియాపై సౌతాఫ్రికా విక్టరీ..

158
South Africa Beat India By 6 Wickets
- Advertisement -

సెంచూరియన్ వేదికగా టీమిండియాతో జరిగిన టీ20లో సౌతాఫ్రికా సత్తాచాటింది. భారత్ విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో చేదించింది. క్లాసన్‌ (69; 30 బంతుల్లో 3×4, 7×6) చెలరేగడంతో బుధవారం జరిగిన రెండో టీ20లో ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. క్లాసన్‌తో పాటు డుమిని (64 నాటౌట్‌; 40 బంతుల్లో 4×4, 3×6) విరుచుకుపడడంతో దక్షిణాఫ్రికా గెలుపు తీరాలకు చేరింది. చివరిదైన మూడో టీ20 శనివారం కేప్‌టౌన్‌లో జరుగుతుంది.

అంతకముందు టాస్ గెలిచిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.ఫస్ట్ పవర్ ప్లేలో రెండు మెయిడెన్లు.. మూడు వికెట్లు కోల్పోయి కుదుపుకు లోనైంది. రోహిత్ శర్మ డకౌట్ కాగా… ధవన్, కోహ్లీ ఓవర్ తేడాలో ఔటవడంతో భారత్ ఇన్నింగ్స్ గాడితప్పింది. రైనా-మనీష్ పాండే కలిసి హిట్టింగ్ దిగడంతో 10 ఒవర్లలో 85 రన్స్ చేయగలిగింది. రైనా ఔటయ్యాక ధోనీతో కలిసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు మనీష్ పాండే. దాంతో నెక్స్ట్ పది ఓవర్లలో ఏకంగా 103 రన్స్ చేసింది భారత్. పాండే, ధోనీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 రన్స్ చేసింది.

JP Duminy played a captain's knock (64*) enabling South Africa beat India by 6 wickets to level the three-match T20I series on Wednesday at the SuperSport Park in Centurion.

చాహల్ బౌలింగ్ లో ఏకంగా ఏడు సిక్సర్లు బాదారు డుమినీ-క్లాసెన్. దాంతో 4 ఓవర్లలో 64 రన్స్ సమర్పించుకున్నాడు చాహల్. టీ20 హిస్టరీలో అత్యంత చెత్త స్పెల్ ఇది.

- Advertisement -