భారత్‌పై దక్షిణాఫ్రికా ఘనవిజయం…

126
sa

కేప్ టౌన్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్టులో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. సిరీస్ గెలవాలంటే కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత్ అట్టర్ ఫ్లాప్ అయింది. టీమిండియాపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత్ విధించిన 212 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కొల్పోయి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది దక్షిణాఫ్రికా. పీటర్సన్ మరోసారి అద్భుత్ ఫామ్‌ను కనపరిచాడు. పీటర్సన్ (82), డస్సెన్ (41 నాటౌట్), బవుమా (32 నాటౌట్) కలిసి దక్షిణాఫ్రికాను విజయ తీరాలకు చేర్చారు.

భారత బౌలర్లు తీవ్రంగా నిరాశపరిచారు. బుమ్రా, షమీ, శార్దూల్, ఉమేష్ యాదవ్, అశ్విన్ దిగ్గజ బౌలర్లందరూ కలిసి మూడంటే మూడే వికెట్లు తీయగలిగారు.