బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో టీమండియా ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 3-1 తేడాతో భారత్‌ను చిత్తు చేసింది ఆసీస్. ఈ నేపథ్యంలో సిడ్నీ టెస్టు ఓటమిపై స్పందించారు సౌరవ్ గంగూలీ. టెస్టు క్రికెట్‌లో భారత క్రికెటర్లు భారీ స్కోరు చేయాల్సిన అవసరం ఉందన్నాడు.
ప్రతి ఒక్కరూ బ్యాట్‌తో రాణించాలన్నాడు. ఎవరినీ నిందించలేమని.. అందరూ పరుగులు సాధించాలన్నాడు. విరాట్ కోహ్లీ ఫామ్‌పై ప్రశ్నించిన సమయంలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తనకు అర్థం కాలేదని.. అతనో గొప్ప ఆటగాడని.. కానీ, సమస్యను అధిగమిస్తాడని తాను నమ్ముతున్నానన్నాడు. జట్టు రాణించాలని.. ఇంతకన్నా ఏం చెప్పగలనన్నాడు.
170-180 పరుగులు చేస్తే టెస్టుల్లో గెలవలేరని.. 340-400 పరుగులు చేయాల్సిందేనని గంగూలీ తెలిపాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-3 తేడాతో ఓటమి పాలుకాగా కేవలం 162 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియాకు నిర్దేశించింది.
Also Read:దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ అభినందనలు