గంగూలీ ..తెగింపే వేరు: అక్తర్

184
ganguly
- Advertisement -

భారత మాజీ కెప్టెన్,బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీపై ప్రశంసలు గుప్పించారు పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్. తాను చూసిన భారత కెప్టెన్‌లలో అత్యుత్తమ కెప్టెన్‌ దాదా అని..భయమెరుగని ఓ యోధుడని కితాబిచ్చాడు.

గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా స్వరూపమే మారిపోయిందని…ఓ సందర్భాన్ని గుర్తుచేశాడు అక్తర్. 2004లో పాక్‌ని టెస్టు సిరీస్‌,వన్డే సిరీస్‌లో ఓడించి భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందన్నారు.

నా బౌలింగ్‌ని ఎదుర్కొనేందుకు గంగూలీ భయపడతాడని అందరూ ఊహించారు. కానీ.. నా వరకూ నేను ఎదుర్కొన్న ధైర్యవంతుడైన బ్యాట్స్‌మెన్‌ గంగూలీనే అని స్పష్టంచేశాడు. గంగూలీ ఛాతికి గురిపెట్టి మరీ బంతులు విసిరాను. కానీ.. ఎప్పుడూ నా బౌలింగ్‌ని ఎదుర్కొనేందుకు వెనకడుగు వేయలేదన్నాడు.

- Advertisement -